జై శ్రీమన్నారాయణ...
"పుణ్య శ్లోకస్య చరితం ఉదాహరణ మర్హతి" యోగ్యమైన , కీర్తి కలిగిన వారి గురించి తెలుపుట మన కర్తవ్యం అంటారు విద్యానాధ పండితులు . పుణ్య శ్లోకులైన శ్రీమాన్ క్రిష్ణమాచార్యుల వారి గురించి తెలియ చేయటం ఒక సుక్రృతం.
"సమానానాం ఉత్తమ శ్లోకోస్తు" అంటారు పెద్దలు. ఆ కాలంలో, ఉత్తమ వృత్తిలో తన సాటివారిలో మేలైన వారనే కీర్తిని పొంది , తన తోటి వారిని కూడా ఉత్తమ శ్లోకులుగా అవ్వాలని మనసారా దీవించే ఉత్తమోత్తమ సంస్కార సంపన్నులైన ఆచార్యులవారి దర్శనం, అనుగ్రహ కటాక్షం కలగడం ఒక భాగ్యం.
కలం(పంచాంగ రచన) గళం ( వేద ...ద్రావిడ ... క్రతు.. నిర్వహణ..)
సమన స్థాయిలో , అసాధారణ మేధో సంపత్తి తో నిర్విరామంగా నిర్వహిస్తూ, ఆశ్రయించిన వారికి ఆది దైవిక ,ఆత్మిక బలాన్ని అందిస్తున్న సంపత్కుమారకృష్ణమాచార్య సిద్ధాంతి వర్యుల శక్తి అనన్య సామాన్యం....
