About Us

 జై శ్రీమన్నారాయణ 

శ్లో|| అద్వేషి నిత్యసంతోషి గణితాగమపారగః | సౌమ్యాశ్చ సత్యభాషీచ సదైవజ్ఞః ప్రకీర్తీతాః ||

శ్లో॥ సేవేసమయ నిర్వాహ వేంకటేశ ప్రసాదితః । చక్రవర్తీతి విఖ్యాతం ఆర్తచక్రం జగద్గురుమ్ ॥

పరమవైదిక సిద్ధాంతముగా అభిజ్ఞులచేప్రశంసింపబడువిశిష్టాద్వైత సిద్ధాంతములో ఉత్తమమైన వంశములోభగవద్నిష్ఠకు శ్రీ మణవాళమహమునులు ఏర్పాటుచేసిన అష్టగోత్రశాఖలో శ్రీవత్సవంశము అగ్రగణ్యమువాత్సల్యకారుణ్యాది గుణప్రయుక్త శ్రీవత్సవంశసంజాతకులు భగవద్గుణగణ మహోదధియందునిమగ్నులై  తత్త్వజ్ఞాన సంపన్నులు శ్రీమద్వేదమార్గప్రతిష్ఠాపనాచార్యులు ఉభయవేదాన్తప్రవర్తకాచార్యులు “శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తులగోవిందాచార్యస్వామి” వారి  ద్వితీయ పుత్రరత్నం  దైవజ్ఞశిఖామణి జ్యోతిష్యశిరోమణి  “ తిరుమల నల్లాన్చక్రవర్తుల సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి స్వామి“  అధీతవేదః కులశీలయుక్తః ।సిద్ధాంతహోరాఖిలసంహితజ్ఞః । అచంచలోరూపయుతఃకృపావాన్ ।త్రిస్కంధ శాస్రాధ్యయనాధీకారీ॥అన్నట్లుగా అచంచల సంస్కార సంపన్నులు నిరంతరజప తప సంస్కార సద్వృత్తి సమరాంగధారులైఅసాధారణ ప్రజ్ఞలో విజ్ఞలో  సిద్ధాంత జ్యౌతిషదివ్యాగమప్రబందాధి మంత్ర ప్రశ్న వాస్తుశాస్త్రాధి విషయములయందు ఘనకీర్తి నొంది“ అనేకసంశయోచ్ఛేధి పరోక్షకార్థస్య దర్శనమ్ సర్వస్యలోచనంశాస్త్రం” మానవజీవితములకు సంబంధించిన అనేకసంశయములనునివృత్తిచేస్తూ పరోక్షవిషయాలనుదర్శింపచేస్తూ భూతభవిష్యద్ధర్శనానికిసాధనంగానిలిచే శాస్రాలోచనంఅవసరమనిశాస్త్రప్రమాణములతో అకుంఠిత దీక్ష ధృఢసంకల్పముతోనిరంతర గ్రంథ పఠనం ద్వారా నిర్వచిస్తూ నిరంతరంనిర్వహిస్తూ  యశస్సుతో  సంపూర్ణజ్ఞానవంతులైపూర్వాచార్యుల మంగళాశాసనములు పరిపూర్ణముగాఅందుకున్నారు . 

పరమాత్మ ఎవరిని ఉద్ధరింపదలచునోవారితో సత్కర్మలను చేయించి అనుగ్రహిస్తారని “పరాత్తుతచ్ఛృతేః”  కర్తృత్వము భగవదాధీనమేనని ''రూపమేవ్యాస్య మహిమానాం వ్యాచష్టే” అను ఆర్యోక్తి మనసిద్ధాన్తి గారి మహత్తును తెలుపుతుంది . మహర్షులయోక్క ప్రోక్తాలైన పురాణాలను ధర్మశాస్త్రాలనువిరోధములేకుండా అనుకూల తర్కములతో  సంధిస్తూఅనేకానేక ప్రమాణాలతో మనకు అందిస్తున్నారు అనేకదేవాలయముల ప్రతిష్ఠలు జీర్ణోద్ధరణలు గావిస్తూ శ్రీవైష్ణవసత్సాంప్రదాయ సంస్కారాన్ని పరిపూర్ణముగా ఆచరిస్తూ“ నిలువెత్తు వైష్ణవత్వమును పలుకులలో పరిమళించుతలవంచని రాజసము కలిగిన’ సంపత్కృష్ణార్య ‘ సిద్ధాంతి ఎంతున్” అన్నట్లుగా మన సిద్ధాన్తిగారు “ శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యులు  ఉభయవేదాన్తప్రవర్తకాచార్యులు  జగదాచార్యులుశ్రీశ్రీశ్రీ త్రిదణ్డిచిన్నశ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరుస్వామివారి ఆస్థాన మరియు శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహస్వామిదేవస్థాన ఆస్థాన సిద్ధాన్తి గా” ఉన్నారు అలానే“తెలంగాణ రాష్ట్ర ఆగమ సలహామండలిజ్యోతిష్యసలహాదారుగా”నియామకం ప్రశంసనీయం.

 సిద్ధాన్తి గారిచే అందిస్తున్న పంచాంగముసూర్యసిద్ధాంతముగా మహోన్నత విలువలతోవిలక్షణంగా రచించబడి సూచించిన విధముగానూటికినూరుపాళ్ళు ఫలితములు జరుగుచున్నవి.“యతిరాజులు భగవద్రామానుజులగు శ్రీశ్రీశ్రీ త్రిదణ్డిచిన్నశ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరుస్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో” జనగామజిల్లాఅంతర్నగరమున బాణాపురములో వేంచేసిన “ శ్రీలక్ష్మీవరాహస్వామి సహిత శ్రీవేంకటేశ్వర స్వామి"మహిమాపారమ్యాన్ని కీర్తిస్తూ అచంచల దీక్షగా భగవత్కైంకర్యమునందు భగవదనుగ్రహము జనులందరికికలగాలని ప్రజారక్షనార్థం “శ్రీ శ్రీనివాసప్పెరుమాళ్అనుగ్రహం కొరకు  లక్షదీపోత్సవము కోటితులసీఅర్చనకోటికుంకుమార్చన అలానే శ్రియఃపతికి వినుపిస్తూసకలదోషాలను పోగొట్టి తనగుణములను జగమంతాఆశ్రయించి ఉండునట్లు ప్రజలందరకు లక్ష్మీ కటాక్షములుఅందించు సంకల్పముతో ‘శ్రీయాగ నక్షత్ర యాగాన్ని'జరిపించినారు.

అలానే శ్రీవేంకటేశ్వరస్వామి వార్కిమరియు లక్ష్మీ అమ్మవారికి  భగవద్బంధువులందరిచే  సువర్ణకిరీటములు సమర్పించారు“   ప్రస్తుత పరిస్థితిలో  ఏర్పడిన ఉపద్రవం నుండి ప్రజారక్షనార్థంపురాణపారాయణములు లక్ష్మీనక్షత్రమాలా శ్రీవిష్ణుపంజరస్తోత్రశ్రీవిష్ణుకవచ శ్రీమదష్టాక్షరీమహామంత్రహవనములు " సలిపి విశేషఫలములు శ్రీశ్రీనివాసపెరుమాళ్ భగవద్బంధువులందరకు అనుగ్రహించారు. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలను సలిపి భక్తజనులందరకుశ్రీ శ్రీనివాసుని కృపను అందరికి అందిస్తున్నారు.