...
Anil.RANGARAJU 14,Sat,May,2022 . 3 years ago

ఆచార్యులు(తాత గారు.)

జై శ్రీమన్నారాయణ.  

"యా స్రృష్టిః స్రష్టురాద్యా వహతి విధిహుతం ,.   యా హవిర్యాచ హోత్రి..." అని కాళిదాసు నుడివిన  పరమ పురుషుని  స్రృష్టి ( పురుష సూక్త) విధానమునూ, వ్యాస సారమంతా కలగలిపి పోత పోసి ఒక పద్యంలో అందించిన పోతన విధానమునూ ( ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై....)  ఆధునికులు అటని , ఇటనీ, ఎటూ తేల్చని 
ఎటూ తేల్చుకోలేక వున్న సమయంలో  ఉదయించి
లోకాలను ఉద్దరించి ప్రకృతి ని , పరమాత్మను కలి కాలంలో   దర్శింపచేయ ప్రయత్నించిన 
మహనీయుల విధాన సారమును మనకు అందించే ప్రయత్నం చేస్తున్న ఆచార్య వరేణ్యులకు నమస్సులు.
అన్నమయ్య అన్నట్లు   ఆది నుండి ...  సంద్యాది విధులను  ద్విదశ వత్సరములుగా అందిస్తూ,  పంచాంగ రచనలో తనదైన ముద్రను సంతరింప చేసుకుంటూ,  ఇటు విశిష్టాద్వైత సంరక్షణ భారాన్ని భుజాలకెత్తుకున్న అపర రామానుజుల కు  అనుంగు లక్ష్మణుడా అన్నట్లు  నిలుస్తున్న 
ఆచార్యుల కివే మా సాష్టాంగ  ప్రణామాలు.

Recent Posts